మరింత సుందరంగా కిషన్‌బాగ్‌ పార్క్‌

నగరంలోని పాతబస్తీలో గల కిషన్‌బాగ్‌ పార్క్‌ను జీహెచ్‌ఎంసీ అభివృద్ధి చేయనుంది. సందర్శకుల సౌకర్యార్థం పార్క్‌లో జీహెచ్‌ఎంసీ మరిన్ని సౌకర్యాలు కల్పించనుంది. పశ్చిక మైదనాల ఏర్పాటు, న్యూ వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌తో పాటు ఇతర సౌకర్యాలను రానున్న కొన్ని నెలల్లో ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని కేబీఆర్‌తో పాటు ఇతర ప్రముఖ పార్కుల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌లను స్థానికులు విశేషంగా వినియోగించుకుంటున్నారు. ఇదే తరహా విధానాన్ని అధికారులు కిషన్‌బాగ్‌ పార్క్‌లో ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పార్క్‌లో ఏర్పాటు చేసే కేఫ్టేరియా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రూ.6.20 కోట్ల వ్యయంతో 4.50 ఎకరాల్లో విస్తరించి ఉన్న పార్క్‌ను జూన్‌ 2018లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.