ముంబైలో అతిపురాతనమైన బ్రిడ్జిని కూల్చివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. లోనావాలాకు సమీపంలో ముంబై-పూణే ప్రాంతాలను కలుపుతూ ఉండే అమృతాంజన్ బ్రిడ్జి కూల్చివేతకు ఆదేశించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థకు ఏప్రిల్ 4 నుంచి 14 మధ్య బ్రిడ్జి కూల్చివేతకు రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు.
కూల్చివేత పనులు చేపట్టనున్న నేపథ్యంలో బ్రిడ్జి వెంట సుమారు 10 కిలోమీటర్ల వెంబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. బ్రిటీషర్ల కాలంలో 1830లో అమృతాంజన్ బ్రిడ్జిని నిర్మించారు. పురాతనమైన ఈ బ్రిడ్జి అనేక ప్రమాదాలకు కారణమవుతుండటంతో..ప్రభుత్వం కూల్చివేయాలని నిర్ణయించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజారవాణా స్తంభించిన నేపథ్యంలో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించింది.