లైట్లు ఆఫ్‌ చేస్తే..పవర్‌ గ్రిడ్‌పై ప్రభావం ఉండదు:ప్రభాకర్‌ రావు

తెలంగాణ పవర్‌గ్రిడ్‌ సురక్షితంగా ఉందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు తెలిపారు. ఒకేసారి దేశం మొత్తం లైట్లు ఆఫ్‌ చేస్తే విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలే ప్రమాదం ఉందని విద్యుత్‌ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో  ప్రభాకర్‌ రావు శనివారం స్పందించారు.


'ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేయడం వల్ల తెలంగాణ పవర్‌గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావమూ ఉండదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం..గ్రిడ్‌కు ఎలాంటి సమస్యా ఉండదు. లైట్లు ఆపితే గ్రిడ్‌ కుప్పకూలుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదు. విద్యుత్‌ బిల్లులను ఆన్‌లైన్‌లో కట్టాలి. తాజా బిల్లులకు సంబంధించి ఈఆర్సీకి లేఖరాశాం..సమాధానం ఇంకా రాలేదు.' అని ప్రభాకర్‌ రావు పేర్కొన్నారు.